Rain Alert: అల్పపీడన ప్రభావం..తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజులు భారీగా వర్షాలు..ఐఎండీ హెచ్చరిక

Rain Alert:  అల్పపీడన ప్రభావం..తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 3 రోజులు భారీగా వర్షాలు..ఐఎండీ హెచ్చరిక
x
Highlights

Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తెలుగురాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు పాటు తెలుగు...

Rain Alert: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం తెలుగురాష్ట్రాలపై ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వరుస అల్పపీడనాలు, తుపాన్ బీభత్సం చేస్తున్నాయి. తాజాగా మరో అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.

తాజాగా వాతావరణ శాఖ వెల్లడించిన వెదర్ రిపోర్టులో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ డిసెంబర్ 11వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతం దగ్గర శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరుతుందని తెలిపింది.

ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ రిపోర్టులో తెలిపింది. డిసెంబర్ 10వ తేదీ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, క్రుష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతరపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

ముఖ్యంగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం నుంచి శుక్రవారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది. రైతులు, ధాన్యం పంటలను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని..వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్ లో ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో 11,12 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories