Weather Report: నేడు దంచికొట్టనున్న భారీ వర్షం..తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

Heavy rain forecast for many districts of Telangana
x

Weather Report: నేడు దంచికొట్టనున్న భారీ వర్షం..తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

Highlights

Weather Report: శుక్రవారం వర్షం దంచికొట్టింది. ముఖ్యంపై హైరదాబాద్ లో భారీగా కురిసింది. ఈరోజు కూడా భారీ వర్షం ఉన్నట్లు వాతావరణం శాఖ తెలిపింది. ఎక్కడెక్కడ భారీ వర్షం కురుస్తుందో తెలుసుకుందాం.

Weather Report:తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. శని, ఆదివారాల్లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. భారత వాతావరణ విభాగం ప్రకారం..గుజరాత్ పై తుఫాన్ ప్రభావం ఉండగా, కేరళపై ధ్రోణి ప్రభావం ఉంది. వీటి కారణంగా ఏపీ, తెలంగాణలో రానున్న ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు ఉంటాయి. ఎండ తక్కువగానే ఉంటుంది. ఇవాళ ఉత్తరాంధ్రలో కొన్ని చోట్లు వర్షం పడుతుంది.

మధ్యాహ్నం 2 తర్వాత ఆదోని, గుంతకల్, అనంతపురం, రాయదుర్గం, హైదరాబాద్లో వర్షం మొదలవుతుంది. ఈ వర్షం క్రమంగా పెరుగుతూ..తెలంగాణలోని చాలా చోట్లు, పశ్చిమ రాయలసీమలో చాలా చోట్లు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

సాయంత్రం 5గంటల తర్వాత హైదరాబాద్, తెలంగాణ, రాయలసీమలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. రాత్రి 8గంటల తర్వాత రాయలసీమలో వర్షం ఆగిపోయి, హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో కురుస్తుంది. రాత్రి 10గంటల తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరుగా వర్షం కురుస్తుంది. రాత్రి 12గంటల తర్వాత ఉత్తరాంధ్రలో మోస్తరుగా పడుతుంది. అయితే ఇది అంచనా మాత్రమేనని..వాతావరణ శాఖ తెలిపింది.

అయితే ఇరు రాష్ట్రాలో గాలులు వీస్తాయి..వర్షం పడే సమయలో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. మొత్తానికి తెలంగాణ, ఏపీలో నేడు వర్షాలు కురుస్తాయని..ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద కూడదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories