Rain Alert: ఏపీకి మరో ముప్పు..వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడం..భారీ నుంచి అతి భారీ వర్షాలు

Rain Alert: ఏపీకి మరో ముప్పు..వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడం..భారీ నుంచి అతి భారీ వర్షాలు
x

Rain Alert: ఏపీకి మరో ముప్పు..వచ్చేవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడం..భారీ నుంచి అతి భారీ వర్షాలు

Highlights

Rain Alert: ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న ఏపీకి మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.

Rain Alert: ఏపీని వర్షాలు వీడటం లేదు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరం దాటిందని..ముప్పు వీడిందని భావిస్తున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది.

బంగాళాఖాతంలో అక్టోబర్ 22న మరో అల్పపీడనం ఏర్పాడు అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో వాతావరణంలో మార్పులు రానున్నాయి.

నేడు శుక్రవారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోకి పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories