Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

Huge Rush of Devotees to Srisailam Mallanna Temple
x

Srisailam: శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ 

Highlights

Srisailam: శ్రావణ సోమవారం కావడంతో దర్శనానికి తరలివచ్చిన భక్తులు

Srisailam: శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణమాసం సోమవారం కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి... శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్‌లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.

మరోపక్క భక్తులు స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో లవన్న ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు.. ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories