ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...

Huge Projects on Green Energy in AP 60000 Crores Investment by Adani Groups | Live News
x

ఏపీలో గ్రీన్‌ ఎనర్జీకోసం భారీ ప్రాజెక్టులు.. రూ.60 వేల కోట్లు పెట్టుబడి...

Highlights

AP News: దాదాపు 10వేలమందికి ఉద్యోగాలు...

AP News: సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం ఆదిశగా కీలక అడుగులు వేస్తోంది. కాలుష్యంలేని ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకోసం MOU కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ ఏర్పాటు చేయబోతోంది.

ఇందులో 3,700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుకాగా, 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఈరెండు ప్రాజెక్టులు అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టులకోసం దాదాపుగా 60వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయనున్నట్టు MOUలో పేర్కొన్నారు. తద్వారా 10వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories