Hormonal Injections: సినిమా ఛాన్స్ కోసం.. కూతుర్ని అలా చేసింది..

Hormonal Injections: సినిమా ఛాన్స్ కోసం.. కూతుర్ని అలా చేసింది..
x

Hormonal Injections: సినిమా ఛాన్స్ కోసం..కూతుర్ని అలా చేసింది

Highlights

సినిమా ఇండస్ట్రీ ఇదొక రంగుల ప్రపంచం. ఇందులో ఉండే ఫేమ్, నేమ్ మరే రంగంలో దొరకదు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.

Growth Hormonal Injections: సినిమా ఇండస్ట్రీ ఇదొక రంగుల ప్రపంచం. ఇందులో ఉండే ఫేమ్, నేమ్ మరే రంగంలో దొరకదు అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే, రాత్రికి రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ లేదా చెన్నై నగరాలకు ట్రైన్ ఎక్కేవారు ఎందరో..ఒక్క ఛాన్స్ దొరికితే చాలన్నట్లు స్టూడియోల చుట్టూ తిరుగేవారికి కొదవే లేదు. అంతగా మాయ చేసే శక్తి సినిమాకే ఉంది. అయితే సినిమా మోజులో పడి కన్నకూతురి ప్రాణాలనే పణ్ణంగా పెట్టింది ఓ మహాతల్లి..

పూర్తి వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఓ మహిళ(42) నివాసం ఉంటుంది. ఓ కుమార్తె పుట్టాక భర్త చనిపోయాడు. దీంతో సదరు మహిళ రెండో వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక..భార్య ప్రవర్తన నచ్చక ఆ రెండో భర్త తన పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయాడు. దీంతో మొదటి భర్త సంతానంతో కలిసి సదరు మహిళ జీవిస్తోంది. ప్రస్తుతం మరొక వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ విషయం నచ్చక తల్లితో గొడవపడింది. దీంతో కుమార్తెను విశాఖపట్నంలోని ప్రభుత్వ విద్యాసంస్థలో చేర్పించింది.

బాలికకు ఇంజక్షన్లు:

పదో తరగతి పరీక్షలు రాసి బాలిక ఇటీవలే ఇంటికి రాగా తల్లి వద్దకు తరచుగా వచ్చే వ్యక్తి చూశాడు. అతడు బాలికకు హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ నూరిపోశాడు. ఇంకేముంది హీరోయిన్ అయితే లైఫ్ సెటిల్ అనుకుందా తల్లి, కూతుర్ని హీరోయిన్ చేసేందుకు అంగీకరించింది. అయితే హీరోయిన్ అవ్వాలంటే శరీర అవయవాలు బొద్దుగా ఉండాలని సదరు వ్యక్తి బాలిక తల్లిని నమ్మబలికాడు. అతడి డైరెక్షన్ లో కుమార్తెకు ఏవేవో ఇంజక్షన్లు ఇవ్వడం ప్రారంభించింది.

సూది మందులు ప్రయోగించడంతో బాలిక అస్వస్థతకు గురైంది. నొప్పి భరించలేకపోతున్నానంటూ బాలిక వేడుకున్నా ఆ తల్లి కనికరించలేదు. ఇక నొప్పి భరించలేక సదరు బాలిక 1098 కు ఫోన్ చేసి తన దైన్య స్థితిని చెప్పుకుంది. వారు వెంటనే అప్రమత్తమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసుల సహకారంతో బాలికను కాపాడారు. ప్రస్తుతం బాలిక విశాఖపట్నంలోని స్వధార్ హోమ్ లో కోలుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories