ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ ప్రభుత్వానికి మరోసారి షాక్.. హైకోర్టు కీలక ఆదేశాలు
x
Andhra Pradesh High Court (File Photo)
Highlights

ఏపీలో పంచాయతీ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.

ఏపీలో పంచాయతీ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వెంటనే తొలగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే రంగులు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల గడువు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు హైకోర్టు దీనికి అంగీకరించి గడువిచ్చింది.

కాగా, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ జెండా పోలిన రంగులు వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కచ్చితంగా రంగులు తొలగించాలని ఆదేశించింది.

ప్రభుత్వ, పంచాయతీ కార్యాలయలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరికొంత సమయం కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై హైకోర్ట్ తాజాగా విచారించింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి మూడు వారాల గడువిచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories