తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ...

High Temperatures Recorded in Telugu States Red and Orange Alert Issued by IMD | Live News
x

తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రెడ్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ...

Highlights

High Temperatures: *ఉదయం 9గంటల నుంచే బయటకు రాని జనం *నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు

High Temperatures: దేశవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వాయువ్య, మధ్య భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ప్రజలు వేడికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఏపీలోనూ పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 దాటిందంటే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

శ్రీకాకుళం జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. జిల్లాలో భానుడి ప్రతాపం తీవ్రమైంది. ఇటీవల తేమతో కూడిన గాలులు వీచేవి. గత వారం రోజులలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. 30 మండలాల్లో తీవ్రస్థాయిలో ఉక్కపోత, చమటలతో ప్రజలు ఇబ్బందులు పడుతునున్నారు. గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇంత వేడి చూడలేదు. ఇదే రీతిలో రణస్థలం మండలంలో సమాన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెళియాపుట్టి, పొందూరు, కోటబొమ్మాళి, కొత్తూరు మండలాల్లో ఎండలు మండిపోయాయి.

మరోవైపు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే కొబ్బరి బొండాలకు డిమాండ్ పెరగింది. రోడ్డు పక్కన దుకాణాలు వెలిశాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బొండాలు, పలు రకాల జ్యూస్‌లను తాగుతున్నారు. జిల్లాలో ఉదయం 10 గంటల నుంచి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఏటా రణస్థలం మండలంలో మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యేది. కానీ ప్రస్తుతం తీర ప్రాంతాల్లో మినహా.. మిగిలిన మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం నగరంతోపాటు మండలాల్లో ప్రధాన రహదారులు నిర్మానుష్యమయ్యాయి.

ఆస్పత్రులు, ఇతర అత్యవసరమైన పనులు ఉంటేనే.. ప్రజలు బయటకు వస్తున్నారు. ఎండ నుంచి రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.దేశవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. వాయువ్య, మధ్య భారత్‌లో ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ప్రజలు వేడికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత 122 ఏళ్లలో ఇది నాలుగో సారి మాత్రమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. ఏపీలోనూ పలు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం 10 దాటిందంటే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories