Nara Lokesh: IRR కేసులో లోకేష్‌కు సీఐడీ నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court Key Directions On CID Notice To Lokesh In IRR Case
x

Nara Lokesh: IRR కేసులో లోకేష్‌కు సీఐడీ నోటీసులపై హైకోర్టు కీలక ఆదేశాలు

Highlights

Nara Lokesh: గంటపాటు లంచ్‌ బ్రేక్‌ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశం

Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసులపై.. హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 4న విచారణకు హాజరుకావాలన్న సీఐడీ నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 10న లోకేష్‌ను విచారించాలని సీఐడీకి ఆదేశించింది. సిఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులోని నిబంధనలను లోకేష్ హైకోర్టులో సవాల్ చేశారు. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని లోకేష్ తరఫు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని చెప్పారు. లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.

దీనిపై సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాము డాక్యుమెంట్లపై ఒత్తిడి చేయబోమని, రేపే విచారణకు హాజరు కావాలని సూచించారు. విచారణకు అంత తొందర ఏముందని లోకేష్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10న లోకేష్.. సీఐడీ ముందు విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలంది. లోకేష్ తరపఉ న్యాయవాదిని కూడా అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సిఐడీకి సూచించింది హైకోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories