అసెంబ్లీ యుద్ధానికి వైసీపీ సిద్దం చేసిన నేతలెవరు?

అసెంబ్లీ యుద్ధానికి వైసీపీ సిద్దం చేసిన నేతలెవరు?
x
జగన్
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తొలిరోజే పానిపట్‌ యుద్ధాన్ని తలపించింది. రానున్న రోజుల్లో బాహుబలి, భళ్లాలదేవల రేంజ్‌లో సమరాన్ని తలదన్నడం ఖాయమన్న మాటలు...

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తొలిరోజే పానిపట్‌ యుద్ధాన్ని తలపించింది. రానున్న రోజుల్లో బాహుబలి, భళ్లాలదేవల రేంజ్‌లో సమరాన్ని తలదన్నడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి. అటు ఎలాగైనా అధికారపక్షంపై పైచేయి సాధించాలని టీడీపీ రణవ్యూహానికి పదును పెడుతుంటే, ఇటు వైసీపీ అధినాయకత్వం కొందరు కీలక నాయకులకు వార్‌ ఫీల్డ్‌ బాధ్యతలను అప్పగించింది. ఇంతకీ ఎవరా యుద్ధవీరులు?

ఆంధ్రప్రదేశ్‌ శీతాకాల సమావేశాలు, వాడివేడిగా మొదలయ్యాయి. తొలిరోజే మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దీంతో రానున్న రోజుల్లో సభ ఎలా సాగబోతోందన్నది, ఫస్ట్‌ డేను బట్టే అర్థమవుతోంది. అయితే ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎలాగైనా పైచేయి సాధించాలని తెలుగుదేశం పట్టుదలగా వుంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు పార్టీ మారతారన్న ఊహాగానాల పెరుగుతున్న నేపథ్యంలో, ఎవరూ చేజారకుండా అసెంబ్లీలో గట్టిగా పోరాడి, అందరిలోనూ ధైర్యంనింపాలన్న ఆలోచన చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా చాలా గట్టి కసరత్తే చేస్తోంది. విపక్షానికి ఏమాత్ర అవకాశం ఇవ్వకుండా, వారి నోరు మూయించాలన్న పట్టుదలతో వుంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ స్ట్రాటజిక్‌ కమిటీ సమావేశాన్ని సైతం నిర్వహించిన సీఎం జగన్, విపక్షానికి దీటైన సమాధానం ఇచ్చేందుకు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించారట.

రాష్ట్రంలో మొన్నటి వరకు ఇసుక సమస్య ప్రధానంగా ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇసుకపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక, ఇంగ్లీష్ మీడియం, మహిళలపై దాడులు, ఉల్లి కొరత, రేటుపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. తొలిరోజే ఉల్లితో పాటు మహిళలపై అత్యాచారాలు, హత్యలపై వాడివేడిగా చర్చ జరిగింది. ఏకంగా సీఎం అగ్రెసివ్‌గా ఆన్సరిచ్చారు. ఇలా ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతీ దానికి సరైన సమాధానం చెప్పాలని భావిస్తోంది వైసీపీ. ఇందుకోసం కొంతమంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు.

కొన్ని కీలక అంశాలకు సంబందించి ఇప్పటికే మంత్రి కొడాలి నాని విరుచుకుపడుతున్నారు. వల్లభనేని వంశీ వ్యవహారంలో టిడిపి చేసిన విమర్శలకు తీవ్రస్థాయిలో సమాధానం చెప్పారు నాని. చంద్రబాబు అమరావతి పర్యటనపైనా ఇదే స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో విషయం వివరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రతిపక్షాలు విమర్శించే ప్రయత్నం చేస్తే, ధీటుగా సమాధానం చెప్పాలని జగన్ సూచించారట. గణాంకాలతో వివరించేందుకు ప్రిపేర్ కావాలని చెప్పారట. దీంతో గణాంకాలతో కుస్తీ పడుతున్నారు నేతలు.

అసెంబ్లీలో కీలక పాత్ర పోషించేందుకు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్‌లకు సీఎం కీలక బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు మరో మంత్రి కన్నబాబు సైతం అసెంబ్లీలో జరిగే ప్రధాన శాఖల చర్చల్లో కీలక భాగస్వామ్యం అవ్వాలని కూడా సీఎం సూచనలు చేశారట. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్‌ రెడ్డికి సైతం అనేక సజెషన్స్ ఇచ్చారట. దీంతో వీరు కొంత మెంటల్‌గా ప్రిపేర్ అవుతున్నారు. వివిధ శాఖల నుంచి వివరాలు తెప్పించుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ పైచేయి సాధించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా హోంవర్క్‌ చేస్తున్నారు మంత్రులు.

మంత్రులతో పాటు కొంతమంది ఎంఎల్ఏలకు కూడా బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్. మల్లాది విష్ణు, అంబటి రాంబాబు, ఆర్కే, మేరుగ నాగార్జున, జోగి రమేష్ ఈ బాధ్యతలు తీసుకుంటారు. మంచి వాగ్దాటి, విషయం ఉన్న వారిని ఎంపిక చేసి సీఎం కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చ జరగాలని సీఎం భావిస్తున్నారు. ఇందుకోసం కొంతమంది నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు.

ప్రభుత్వానికి మొదటి ఆరు నెలలు చాలా ముఖ్యమైనవి. ఇంచుమించు లెక్కకు మించి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోంది. దీంతో వీటిపై సమర్ధవంతమైన చర్చ జరగాలని సీఎం ఆలోచిస్తున్నారు. ఇందుకోసమే కీలక నేతలకు అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే బాధ్యతలు అప్పగించారు. ప్రతిపక్షం కూడా ఈ సమావేశాలను బాగా ఉపయోగించుకోవాలనే ఆలోచనలో ఉంది. ప్రధానంగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా తన విశ్వరూపం చూపిస్తుంటారు. దీంతో అమరావతి పర్యటనలో తనపై జరిగిన దాడి వ్యవహారాన్ని కూడా అసెంబ్లీలో బలంగా ప్రస్తావించాలని వ్యూహాలకు పదునుపెడుతున్నారట. చూడాలి ఏపీ అసెంబ్లీ సమరం ఎలా సాగబోతోందో.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories