Heavy Rains in AP: ఏపీలో వర్షాలు.. రెండు రోజుల్లో బలహీన పడే అల్పపీడనం

Heavy Rains in AP: ఏపీలో వర్షాలు.. రెండు రోజుల్లో బలహీన పడే అల్పపీడనం
x
Heavy rains in AP (File Photo)
Highlights

Heavy Rains in AP: ఏపీలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది.. రెండు రోజుల్లో బలహీన పడే దీనివల్ల రాష్ట్రంలో పలు చోట్ల తీవ్రస్థాయిలోవర్షాలు కురిశాయి.

Heavy Rains in AP: ఏపీలో అల్పపీడన ప్రభావం కొనసాగుతోంది.. రెండు రోజుల్లో బలహీన పడే దీనివల్ల రాష్ట్రంలో పలు చోట్ల తీవ్రస్థాయిలోవర్షాలు కురిశాయి. దీంతో పాటు తీరం వెంబడి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న రెండు రోజుల్లో ఇది బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో బుధవారం విజయనగరం, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. 6, 7, 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.

► ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్‌ తీరాలను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

► కోస్తా తీరం వెంట గంటకు 50 నుంచి 60 కి.మీ వేగం గాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉండనుంది. రెండు రోజులపాటు కోస్తా తీర ప్రాంత మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

► గత 24 గంటల్లో వర రామచంద్రాపురంలో 6 సెం.మీ, పోలవరం, పాడేరుల్లో 5, ప్రత్తిపాడు, పెద్దాపురంల్లో 4, చింతపల్లి, కుక్కునూరు, అమలాపురం, తాడేపల్లిగూడెం, కూనవరం, భీమడోలుల్లో 3 సెం.మీ

వర్షపాతం నమోదైంది.అయితే ఈనెల 9న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణశాఖ తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories