Kurnool: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

Heavy Rains in Kurnool District
x

కర్నూల్ జిల్లాలో వర్షాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Kurnool: ఉప్పొంగుతున్న వాగులు * పలు మండలాల్లో భారీ వరద

Kurnool: కర్నూలు జిల్లాలో వర్షం జోరుగా కురుస్తోంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

కౌతాళం, నందవరం, కోసిగి, కోడుమూరు, పెద్దకడుబూరు, బండి ఆత్మకూరు, సున్నిపెంట, ఆస్పరి, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని మండలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తుమ్మలవాగు, పెంచికలపాడు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక కొడుమూరు పట్టణంలోకి వరద భారీగా వచ్చి చేరింది. భారీ వరద కారణంగా కర్నూలు- ఎమ్మిగనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. నందవరం మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలోని వరద నీరు ప్రవేశించింది. పెద్దకొత్తిలి వాగు ఉప్పొంగడంతో అక్కడి పంట పొలాలను వరద ముంచెత్తింది.

Show Full Article
Print Article
Next Story
More Stories