Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో నిండిన కంపార్ట్‌మెంట్లు

Heavy Pilgrim Rush at Tirumala Temple
x

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో నిండిన కంపార్ట్‌మెంట్లు

Highlights

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శ్రీవారి దర్శనం కోసం వారికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 75 వేల 125 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా, 31 వేల 140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి 5 కోట్ల 41 లక్షల రూపాయల ఆదాయం చేకూరింది.

మరో వైపు తిరుమలలోని నడకమార్గంలో టోకెన్ల స్కానింగ్‌ను టీటీడీ పున:ప్రారంభించనుంది. పన్నెండు వందల మెట్టు దగ్గర టోకెన్లు స్కాన్ చేసిన తర్వాతే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించనుంది. గతంలో చిరుతల దాడులతో టోకెన్ జారీ విధానంలో మార్పులు చేసింది గత ప్రభుత్వం. దీంతో టోకెన్ల జారీ విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళ్లారు విజిలెన్స్ అధికారులు.దీంతో పాత విధానాన్ని కొనసాగించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories