Nellore: నెల్లూరు జిల్లాలో వరద విలయతాండవం

Heavy Floods in Nellore Due to Rains
x

నెల్లూరు జిల్లాలో భారీ వరదలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Nellore: జలదిగ్బంధంలో పలు గ్రామాలు * కొట్టుకుపోయిన 16వ నెంబరు జాతీయ రహదారి

Nellore: భారీ వర్షాలకు పెన్నా నదిలో వరద పోటెత్తుతోంది. దీంతో నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలోని దామరమడుగు వద్ద 16వ నంబరు జాతీయ రహదారి తెగిపోయింది. నెల్లూరు నగరం దాటాక చెన్నై- కోల్‌కతా మార్గంలో హైవే ధ్వంసమైంది. పడుగుపాడు వద్ద కూడా రోడ్డు కోతకు గురైంది. దీంతో విజయవాడ- నెల్లూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు నుంచే రాకపోకలు సాగుతుండటంతో వాహనాలు బారులు తీరాయి.

తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా వెళ్లే వాహనాలను పోలీసులు తొట్టంబేడు చెక్‌పోస్టు వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు ఆగిపోయాయి. వాహనదారులు కడప, పామూరు, దర్శి వైపుగా వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరుకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు సంగం- ఆత్మకూరు జాతీయ రహదారిపై రాకపోకలను పోలీసులు అనుమతించారు. సంగం మండలం కోలగట్ల వద్ద ముంబయి జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గడంతో నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లే వాహనాలను విడిచిపెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories