CBN Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. ఈనెల 19కి విచారణ వాయిదా

Hearing On Chandrababu Quash Petition In Ap High Court Adjourned
x

CBN Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్.. ఈనెల 19కి విచారణ వాయిదా

Highlights

Chandrababu: సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశం

Chandrababu: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అయితే ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరువైపు వాదనలు పూర్తిగా వినాల్సి ఉందన్న ధర్మాసనం... సోమవారం వరకు కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశించింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటషన్ పై విచారణ హైకోర్టులో ప్రారంభమయింది. ఈ కేసులో చంద్రబాబుపై ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని ఆయన తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టును కోరారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకోలేదని ఆయన చెప్పారు.

చంద్రబాబుపై విచారణ ప్రాథమిక దశలో ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని ఏఏజీ పొన్నవోలు కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఇరువైపుల వాదనలను పూర్తిగా వినాల్సి ఉందని చెప్పింది. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని పొన్నవోలు కోరారు. దీంతో, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నామని, ఆలోగా కౌంటర్ వేయాలని ఆదేశించింది. అయితే సీఐడీ కస్టడీకి చంద్రబాబును ఇవ్వొద్దని కోర్టును లూథ్రా కోరారు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు... వచ్చే సోమవారం వరకు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories