ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ

Hearing on Chandrababu Bail Petitions today
x

ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ

Highlights

Chandrababu: చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం

Chandrababu: నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన పీటి వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ మరోసారి పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. రింగ్ రోడ్డు అలైన్మెంట్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో ఇప్పటికే సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. కాగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడగించింది.

స్కీల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు..ఈనెల 10న ఏసీబీ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబు జ్యూడిషీయల్ రిమాండ్‌లో ఉండగానే.. కేసు విచారణ కోసం సీఐడీ అధికారులు ఆయన్ను కస్టడీకి కోరారు. 5 రోజుల కస్టడీ కోరితే.. కోర్టు 2 రోజులకే అనుమతి ఇచ్చింది. దీంతో రెండు రోజుల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. రాజమండ్రి జైలు సెంట్రల్ హాల్‌లోనే శనివారం 6గంటల పాటు, ఆదివారం 6గంటల పాటు అధికారులు విచారించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో విచారణ కొనసాగింది. ప్రతి గంటకు 5నిమిషాల పాటు విరామం ఇస్తూ.. రెండు సీఐడీ బృందాలు చంద్రబాబును విచారించాయి.

స్కిల్ స్కామ్ లో 371 కోట్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, అందులో చంద్రబాబు పాత్రపై ప్రశ్నలు సంధించారు సీఐడీ అధికారులు. జీవోలో ఒకలా,, స్కీమ్ అమలు మరోలా ఉండడానికి గల కారణాలను రాబట్టే ప్రయత్నం చేశారు. సీమెన్స్ కంపెనీ తన వంతు నిధులు ఇవ్వకముందే.. ప్రభుత్వం 371 కోట్లు ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందని.. దీనిపై సంబంధింత శాఖ అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారని ప్రశ్నలు అడిగారు. టెక్నికల్ ఇష్యూస్, సంబంధిత ఆధారాలను చంద్రబాబు ముందు ఉంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దాదాపు 30ప్రశ్నల వరకు చంద్రబాబును అడిగినట్టు తెలుస్తోంది. చంద్రబాబు లాయర్ల సమక్షంలోనే.. విచారిస్తూ.. ఆయన చెప్పిన సమాధానాలను రికార్డు చేశారు. చివరి గంట విచారణలో చంద్రబాబుకు ఐటీ నోటీసులపైనా సీఐడీ ఆరా తీసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories