చమురు ధరల ఎఫెక్ట్.. ఒక్కసారిగా రేట్లు పెంచేసిన హార్వెస్టర్ యజమానులు...

Harvester Charges Increased Rapidly Due to Diesel Price Hike | AP Live News
x

చమురు ధరల ఎఫెక్ట్.. ఒక్కసారిగా రేట్లు పెంచేసిన హార్వెస్టర్ యజమానులు...

Highlights

Harvester Charges: ఈ ఛార్జీలను ప్రభుత్వం నియంత్రించాలని రైతుల వినతి...

Harvester Charges: గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్న రైతన్నలకు పెరిగిన చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఖరీఫ్ కోతల సమయంలో హార్వెస్టర్ ఛార్జీలకు అమాంతం రెక్కలొచ్చాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టిన రైతులకు తిప్పలు తప్పడం లేదు.

ఏడాది క్రితం 86 రూపాయిలున్న డీజిల్ ధర 20 రూపాయిలు పెరిగి ఇప్పుడు 106 రూపాయిలకు చేరింది. గత ఏడాది గంటకు 2 వేల నుంచి 2,200 వసూలు చేసిన హార్వెస్టర్ యజమానులు ఈ ఏడాది ఒక్కసారిగా రేట్లను డబుల్ చేశారు. అయితే పెరిగిన ధరలకు అనుగుణంగా ధాన్యానికి గిట్టబాటు ధర అన్నదాతలు లబోదిబోమంటున్నారు.

అయినా ప్రభుత్వం హార్వెస్టర్ ఛార్జీల నియంత్రణపై దృష్టి సారించడం లేదని రైతులతో పాటు వామపక్షాలు విమర్శిస్తున్నాయి. పెరుగుతున్న చమురు ధరల భారం రైతులపై పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనని చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories