Harirama Jogaiah: పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తే.. పవన్‌కు రెండున్నరేళ‌్లు సీఎం ఇవ్వాలి

Harirama Jogaiah Letter To Pawan Kalyan Over Tdp Janasena First List
x

Harirama Jogaiah: పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తే.. పవన్‌కు రెండున్నరేళ‌్లు సీఎం ఇవ్వాలి

Highlights

Harirama Jogaiah: జనసేన శక్తిని పవనే తక్కువ అంచనా వేసుకుంటున్నారు

Harirama Jogaiah: టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా జరిగిన సీట్ల పంపకంపై మాజీ ఎంపీ.. జనసేన మద్దతుదారుడు హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జరిగిన సీట్ల పంపకం కులాల వారిగా జరగలేదని.. ఈ సీట్ల పంపకం ఏ ప్రాతిపదికపై జరిగిందని ప్రశ్నించారు. సీట్లు టీడీపీ ఇవ్వడం ఏంటి..? జనసేన తీసుకోవడం ఏంటి..? 24 సీట్లు మించి గెలిచే స్థోమత జనసేనకు లేదా...? మరీ అంత బలహీనస్థితిలో జనసేన పార్టీ ఉందా.. అంటూ నిలదీశారు..?

మొన్న జరిగిన సీట్ల పంపకం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్ కల్యాణ్ చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. జనసేనకు సామాజికపరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60 వరకూ ఉన్నాయన్నది వాస్తవమని.. పవన్ చంద్రబాబుకు వంతు పాడుతున్నారని మండిపడ్డారు. జనసేన శక్తిని పవనే తక్కువ అంచనా వేస్తున్నారన్నారు. పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తే.. పవన్‌కు కూడా రెండున్నరేళ్లు సీఎం పదవి ఇవ్వాలని హరిరామజోగయ్య డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories