Weather Report: ఏపీలో రెండు రోజులపాటు వడగాలులు

Hailstorm for Two Days in Andhra Pradesh
x

Weather Report: ఏపీలో రెండు రోజులపాటు వడగాలులు

Highlights

Weather Report: నేడు 17, రేపు 147 మండలాల్లో వడగాలులు వీస్తాయన్న అధికారులు

Weather Report: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజలుపాటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేడు 17, రేపు 147 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నిన్న కూడా పలు జిల్లాల్లో వడగాల్పులు ప్రజలను వేధించాయి. కడప, నంద్యాల, ఎన్టీఆర్, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో వడగాలులు వీచాయి.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో నిన్న అత్యధికంగా 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా మాచర్లలో 44.7, ప్రకాశం జిల్లా మర్రిపూడిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. సముద్రం మీదుగా వీచే తేమగాలులతో వాతావరణంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో నిన్న సాయంత్రం ఉత్తర కోస్తాలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories