Had Raghurama Krishnam Raju Controversy Has Come To End: రాజుగారి తిరుగుబాటు సినిమాకు కథా, స్క్రీన్‌ ప్లే ఎవరు?

Had Raghurama Krishnam Raju Controversy Has Come To End: రాజుగారి తిరుగుబాటు సినిమాకు కథా, స్క్రీన్‌ ప్లే ఎవరు?
x
Highlights

Had Raghurama Krishnam Raju controversy has come to end: దేశరాజధాని ఢిల్లీ నుంచి ఏపీలోని పొలిటికల్ గల్లీల వరకూ ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్...

Had Raghurama Krishnam Raju controversy has come to end: దేశరాజధాని ఢిల్లీ నుంచి ఏపీలోని పొలిటికల్ గల్లీల వరకూ ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ కనిపిస్తోంది. అధికార వైసీపీలో ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ వినిపిస్తోంది. మన పార్టీ నుంచి గెలిచి, ఇప్పుడు తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారేంటీ అనే డిస్కషన్ వైసీపీ నేతల మధ్య జరుగుతోంది. ఇదంతా ఎవరి గురించో, మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది కదా అవును, ఆయన గురించే ఇదంతా...? మరి ఆయన గురించి ఇంకొంచెం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి.

ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈయన గురించి ప్రస్తుత రాజకీయాలను దగ్గరగా గమనిస్తోన్న వారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన రఘురామకృష్ణం రాజు, ఇప్పుడు ఆ పార్టీకి టెంపర్ మెంట్ తెప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలిని తప్పుబడుతూ వార్తల్లోకి ఎక్కిన రఘురామకృష్ణం రాజు, ఇప్పుడు ఆపార్టీకి ప్రతికూలంగా మారిన ప్రతి అంశంపైనా స్పందిస్తూ కంట్లో నలుసు, కాల్లో ముల్లులా మారాడు. అది ఇసుక వ్యవహారం కావచ్చు..లేదా మద్యం విధానం అవొచ్చు..లేదంటే నిమ్మగడ్డ ఎపిసోడ్ కావచ్చూ...కాదంటే తాజాగా టిడిపి నేత నలందా కిషోర్ మృతిపైనా అవ్వచ్చు. అంశం ఏదైనా సరే, తన టార్గెట్ మాత్రం సొంతపార్టీని సర్ఫ్ వేసి ఎడాపెడా కడిగేయటమే. విపక్షాల కన్నా ముందుగానే స్పందిస్తూ వైసీపీ నేతలకు బీపీ తెప్పిస్తున్నారు. మీరు చేస్తోంది కరెక్ట్ కాదు, సంజాయిషీ ఇవ్వమని పార్టీ నుంచి నోటీసు పంపిస్తే వైసీపీ అసలు పేరు అదికాదు, అందులో క్రమశిక్షణ కమిటీ ఎక్కడ..? తనకు నోటీసు ఇచ్చే అధికారం ఇంకెక్కడంటూ ఎదురుదాడికి దిగి రచ్చరచ్చ చేసేశారు. దీంతో ట్రిపుల్ ఆర్ గా సోషల్ మీడియా ముద్దుగా పిలుచుకునే ఈ రఘురామకృష్ణం రాజు వెనుక, ఎవరున్నారు...? ఇదంతా ఎవరు నడిపిస్తున్నారనే చర్చ అధికార వైసీపీలో నడుస్తోందిప్పుడు.

అయితే వైసీపీలో మెజార్టీ వర్గం మాత్రం ఈ ట్రిపుల్ ఆర్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటోంది. ట్రిపుల్ ఆర్ సినిమా వెనుక దర్శకుడు రాజమౌళి ఉన్నాడన్నది తెలుసుకానీ ఈ పొలిటిషియన్ ట్రిపుల్ ఆర్ వెనక ఎవరున్నా రో తెలుసుకోవాల్సిన అవసరం లేదన్న వాదన ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. పార్టీ పట్ల విధేయత, క్రమశిక్షణ లేని వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న చర్చ ఆ పార్టీలో జరుగుతున్నట్లు సమాచారం. ప్రతి ఎన్నికల ముందూ పార్టీలు మారటం, ఆ తర్వాత సిద్ధాంతాలు మార్చుకుని రాద్దాంతాలకు దిగటం ఆయనకు మామూలేనన్న మాటలు పార్టీనేతల నుంచి వినిపిస్తున్నాయి. గెలిపించిన నియోజవర్గం అభివృద్ధిని పట్టించుకోకుండా ఢిల్లీలో ఉంటూ రాజకీయాలు చేయటమేంటంటూ స్ట్రెయిట్ గా వేలెత్తి చూపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్యాంటు నుంచి పంచె కట్టుకు వేషధారణ మారిందే తప్ప, ఆయన పద్దతి మాత్రం పాత చింతకాయపచ్చడేనన్న పెదవి విరుపులు సైతం అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. ఆయన వెనక బీజేపీ ఉందన్న వార్తలు అవాస్తవమేననీ, అలాంటి కలరింగిచ్చి లబ్ధి పొందటానికి ఈ ట్రిపుల్ ఆర్ చేసే జిమ్మిక్కేనన్న విషయాన్నివీరు కుండబద్ధలు కొడుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో తమ ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, తమ పార్టీ గుర్తు లేకుండా గెలిచారా...? అలా గెలవగలిగితే రాజీనామా చేసి మళ్లీ గెలవమని సవాళ్లు కూడా విసురుతున్నారు సదరు నేతలు.

మొత్తంగా ఈట్రిపుల్ ఆర్ వ్యవహారం విపక్షాలకు మంచింగ్ లా కనిపిస్తోంటే అధికార వైసీపీ మాత్రం, ఆయనపై పంచింగ్ కోసం వేచిచూస్తోంది. తమపై మాట్లాడే అర్హత లేని రాజుగారిపైన అనర్హత వేటేయటమేసరని, లోక్ సభ స్పీకర్ ను కోరిన నేపథ్యంలో అతి త్వరలోనే ట్రిపుల్ ఆర్ ఇష్యూ ఓ కొలిక్కివస్తుందని భావిస్తోంది. మరి ఎన్నికలైన ఏడాదికే అసమ్మతి స్వరం వినిపించాల్సిన అవసరం ఏమొచ్చిందో..? హస్తిన నుంచే అసంతృప్తి సెగలు ఎందుకు కక్కుతున్నారో ఆయన వెనక వున్నది కాషాయమో, పసుపు దండోనన్న అనుమానాలు అసలు రాజుగారి మదిలో ఏముందోనన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. చూద్దాం కాలం కలకాలం ఒకేలా ఉండదు కదా.



Show Full Article
Print Article
Next Story
More Stories