టీడీపీ నేత సబ్బం హరికి షాక్.. కార్యాలయం కూల్చివేత

టీడీపీ నేత సబ్బం హరికి షాక్.. కార్యాలయం కూల్చివేత
x
Highlights

విశాఖలో మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కార్యాలయం అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారు. దీంతో విశాఖలో సబ్బం హరి..

విశాఖలో మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరికి జీవీఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన కార్యాలయం అక్రమ కట్టడం అంటూ కూల్చివేశారు. దీంతో విశాఖలో సబ్బం హరి నివాసం వద్ద కొంత ఉద్రిక్తత నెలకొంది. సీతమ్మధారలో సబ్బం హరి ఇంటి వద్ద ఉన్న కార్యాలయాన్ని జీవీఎంసీ తొలగించారు. ఇంటిని ఆనుకుని ఉన్న టాయిలెట్‌ను కూడా అధికారులు కూల్చివేశారు. అయితే తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కార్యాలయాన్ని కూల్చడం ఏమిటని సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు కార్యాలయాన్ని ఎందుకు కూల్చుతున్నారో అధికారులు ముందుగా చెప్పలేదని..

కూల్చివేతకు కారణాల్ని రాసివ్వాలంటే అధికారులు అసలు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సబ్బం కార్యాలయాన్ని కూల్చుతున్నారన్నవిషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున సబ్బం హరి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కాగా సబ్బం హరి ఒకసారి విశాఖ మేయర్ గాను మరోసారి అనకాపల్లి ఎంపీగానూ ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన టీడీపీలో చేరారు. విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓటమిపాలయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories