GVL Narasimha Rao: ఏపీలో తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలని.. నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లా

GVL Narasimha Rao Comments On Winning Of Telangana Assembly Elections
x

GVL Narasimha Rao: ఏపీలో తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలని.. నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లా

Highlights

GVL Narasimha Rao: ఏపీలో తూర్పు కాపులు వలస కూలీలుగా ఉన్నారు

GVL Narasimha Rao: ఏపీలో తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలని నేషనల్ బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో తూర్పు కాపులను ఓబీసీల్లో చేర్చడానికి ఎన్‌సీబీసీ ఆమోదం తెలిపిన అధికారిక ఉత్తర్వులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో తూర్పు కాపులు వలస కూలీలుగా ఉన్నారని జీవీఎల్ తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని, BRSను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు జీవీఎల్. ఏపీ,తెలంగాణలో కమ్యూనిస్టులకు ప్లేసు లేదన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎవరైనా బీజేపీకి అనుకూలంగానే ఉంటారని, ఎవరికో అనుకూలంగా ఉండటం కోసం అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించదన్నారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందన్నారు జీవీఎల్.

Show Full Article
Print Article
Next Story
More Stories