అక్కడ అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి ఒక్కటయ్యారు

Guntur boy marries Turkey girl According to Hindu Tradition in Andhra Pradesh
x

అక్కడ అమ్మాయి.. ఇక్కడి అబ్బాయి ఒక్కటయ్యారు

Highlights

*గుంటూరు అబ్బాయిని పెళ్లాడిన టర్కీ అమ్మాయి *దేశాంతర ప్రేమ-పెళ్లి కథకు ఆశీర్వాదం

Andhra Pradesh: అక్కడ అమ్మాయి ఇక్కడి అబ్బాయి ఒక్కటయ్యారు. దేశ సరిహద్దులు చేరిపేసి, కులమతాల అవంతరాలను నెట్టేసి వారిద్దరూ ఒక్కటయ్యారు. గుంటూరుకు చెందిన మధు సంకీర్త్, టర్కీ అమ్మాయి గిజెమ్ హిందూ సంప్రదాయం ప్రకారం ఘనాంగా పెళ్లి చేసుకున్నారు. మధు, గిజెమ్ లది దేశాంతర ప్రేమకథ. గిజెమ్ 2016లో ఓ ప్రాజెక్టు కోసం భారత్ వచ్చింది. ఆ సమయంలోనే మధు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మధు కూడా ఉద్యోగ రీత్యా టర్కీ వెళ్లడంతో వారి మధ్య అనుబంధం మరింత పెరిగింది. అది ప్రేమగా మారింది.

కాగా వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరించడంతో ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. మధు సంకీర్త్ తల్లిదండ్రులు దమ్మాటి వెంకటేశ్వర్లు, గౌరీశంకరి. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. మొదట్లో అబ్బాయి తల్లి, అమ్మాయి తల్లి కొంచెం సంశయించినా, ఆ తర్వాత మనసు మార్చుకుని పెళ్లికి ఓకే చెప్పారు. వాస్తవానికి మధు, గిజెమ్ ల నిశ్చితార్థం 2019లోనే జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి ఆలస్యం అయింది. తొలుత వీరు ఈ ఏడాది జులైలో టర్కీలో అమ్మాయి తరఫు వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు భారత్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం మధు, గిజెమ్ ఆస్ట్రియాలో ఉద్యోగాలు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories