AP News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

Guidelines issued for transfers of employees in AP
x

AP News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ

Highlights

AP News: మొత్తం 15శాఖల్లో బదిలీలు చేపట్టాలని నిర్ణయం

AP News: ఏపీలో ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం 12 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రజా సంబంధ సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలు జరగనున్నాయి. పంచాయతీరాజ్, రెవెన్యూ, మున్సిపల్, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, మైనింగ్, పౌర సరఫరాల శాఖ, అటవీ, విద్యుత్, పరిశ్రమలు, దేవాదాయ శాఖ, రవాణా శాఖల్లో బదిలీలు జరగనున్నాయి. ఆగస్టు నెలాఖరులోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories