Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండింది.. ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచేశారు..

Gudivada Amarnath Comments on Chandrababu Arrest in AP Skill Development Scam Case
x

Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండింది.. ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోచేశారు..

Highlights

Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండిందని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు.

Gudivada Amarnath: చంద్రబాబు పాపం పండిందని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మండిపడ్డారు. రాజకీయ కక్షతో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించామన్న ఆరోపణలను మంత్రి గుడివాడ అమర్నాథ్ తోసిపుచ్చారు. కక్ష సాధింపు ఉద్దేశం ఉంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు చేసేవాళ్లమన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో పక్కా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నందునే చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు స్కిల్డ్‌ క్రిమినల్‌, అన్‌స్కిల్డ్‌ పొలిటీషియన్‌ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన హయాంలో అన్నీ స్కాములేనని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories