AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం

Grand Welcome To Droupadi Murmu In AP
x

AP: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం

Highlights

*ముర్ముకు పౌర సన్మానం చేసిన గవర్నర్ బిశ్వభూషన్, సీఎం జగన్

CM Jagan: దేశ చరిత్రలో తొలిసారి గిరిజన మహిళ రాష్ట్రపతి పదవి చేపట్టడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమన్నారు సీఎం జగన్. ఏపీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోరంకి మురళి రిసార్ట్స్‌లో పౌర సన్మానం చేశారు. సామాజిక వెత్తగా, ప్రజాస్వామ్యవాదిగా అణగారిన వర్గాల కోసం ద్రౌపది ముర్ము కృషి చేశారని సీఎం జగన్ కొనియాడారు. మహిళ సాధికారతకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిబింభమని సీఎం జగన్ అన్నారు.

ప్రేమకు భాష అడ్డంకి కాకుడదని.. అందుకే తాను హిందిలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పోరంకి మురళి రిసార్ట్స్‌లో పౌర సన్మానం కార్యక్రమంలో ప్రసంగించారు. బాలాజీ పవిత్ర స్థలానికి రావడం సౌభాగ్యంగా భావిస్తున్నానని..రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అన్నారు.

ఏపీలో రాష్ట్రపతి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషన్ ఏర్పాటు చేసిన విందులో ప్రెసిడెంట్ ముర్ముతోపాటు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం జగన్ , సీజేఐ మిశ్రా పాల్గొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories