Y S Jagan: ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం

Governments failure to maintain law and order in AP Says Y S Jagan
x

Y S Jagan: ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం

Highlights

Y S Jagan: వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు

Y S Jagan: ఏపీలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దారుణంగా దాడులు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్ ధ‌్వజమెత్తారు. వినుకొండలో జరిగిన హత్యా ఘటనే ఇందుకు పరాకాష్ట అన్నారు ఆయన. నడిరోడ్డు మీద కత్తితో జరిగిన దాడి అత్యంత అమానుషం అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు జగన్‌ దిశానిర్ధేశం చేశారు. ఏపీలో ప్రతిపక్షంపై జరుగుతున్న దాడిని పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఈ మేరకు జగన్ సూచించారు.

ప్రభుత్వం మారాక ఇప్పటి వరకూ 36 మంది రాజకీయ హత్యలకు గురయ్యారని, వేయికిపైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయని జగన్ ఆరోపించారు. హత్యలు, దాడులు చేయడానికి టీడీపీ వాళ్లకి లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఉందని మండిపడ్డారు జగన్. ఇలాంటి దాడులతో చంద్రబాబు ఆశించినట్టుగా వైసీపీని అణగదొక్కలేరని, జరుగుతున్న ఘటనలు ప్రజల్లో మరింత ఆగ్రహానికి దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్‌ చేయాలన్నారు.చంద్రబాబుకు గట్టిగా హెచ్చరికలు పంపాలని, పోరాటం చేయకపోతే దారుణాలకు అడ్డుకట్ట పడదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన తెలుపుతామన్నారు జగన్. ఢిల్లీలో నిరసనతో ఏపీలో జరిగిన దారుణాలన్నింటినీ దేశ ప్రజలకు చూపెట్టాలన్నారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories