Pasu Bima: రైతులకు అదిరిపోయే వార్త..రూ. 190 కడితే..ఖాతాలోకి రూ. 15వేలు, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Good News for Farmers Get Subsidy on Pasu Bima Yojana Premium
x

Pasu Bima: రైతులకు అదిరిపోయే వార్త..రూ. 190 కడితే..ఖాతాలోకి రూ. 15వేలు, ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Highlights

Pasu Bima: రైతులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే రూ. 190 కడితే ఏకంగా రూ. 15వేల వరకు పొందే బంపర్ అవకాశం ఇది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Pasu Bima: సామాన్య రైతులకు ఇది గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా పాడీ రైతులకు తీపికబురే అని చెప్పవచ్చు. అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. భారీ వర్షాల దెబ్బకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈమధ్యే వచ్చిన విజయవాడ వరదలను ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న బీమా ప్రయోజనం పొందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పశు బీమాను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతులకు ప్రతిఏటా బీమా చెల్లింపుల్లో రాయితీలను ప్రకటించింది ప్రభుత్వం.

పాడి పశువులతోపాటు గొర్రెలు, మేకలు, పందులు వంటి పశువులు ఈ బీమా వర్తిస్తుంది. రూ. 6వేల చొప్పున పరిహారం లభిస్తుంది. ఈ ఆర్థిక ఏడాది నుంచే ఈ స్కీంను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువులకు బీమా చెల్లింపుల్లో రూ. 15వేలకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ రూ. 768 పోను మిగిలిన రూ. 192 చెల్లించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు దారులు రూ. 480 రాయితీపోను మిగిలిన రూ. 480 చెల్లించాల్సి ఉంటుంది.

అయితే దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. బీమా కావాలనుకునే బ్యాంకువారు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు, ఎస్సీ, ఎస్టీలు తెల్లరేషన్ కార్డు వంటివి అందించాల్సి ఉంటుంది. పశువులు మరణించిన వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి సమాచారం అందించాల్సిన ఉంటుంది. బీమా సర్వే సిబ్బంది వచ్చేంత వరకు పశువుల చెవికి వేసిన ట్యాగ్ ను తీసివేయకూడదు.

రేషన్ కార్డు ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 80శాతం, ఇతర రైతులకు 50శాతం ప్రీమియం రాయితీతో నాటు పశువులకు రూ. 15వేలు, మేలుజాతి పశువులకు రూ. 30వేల వరకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. వీటికి తోడు పాడి రైతులు రూ. 30వేల కన్నా అదనంగా బీమా చేసుకోవాలని భావించినట్లయితే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి 3ఏండ్ల కాల పరిమితికి బీమా ప్రీమియంలో 50శాతం రాయితీని అందిస్తుంది. పశువులకు బీమా చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పశువైద్యాధికారులు చెబుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories