TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్..భక్తులకు అడిగినన్ని లడ్డూలు

TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్..భక్తులకు అడిగినన్ని లడ్డూలు
x
Highlights

TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా...

TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. శ్రీవారి భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామానికి కూడా టీటీడీ సిద్ధమవుతోంది.

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. రాష్ట్రం నుంచే కాదు దేశంలోని నలుమూల నుంచి భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంటుంది. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ గురించి అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారిని దర్శించుకున్న అనంతరం టీటీడీ భక్తులకు ఫ్రీగా ఒక లడ్డూను అందజేస్తుంది.

అయితే ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. భక్తులకు అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అదనంగా లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బందిని కూడా నియమించేందుకు సిద్ధమవుతోంది. టీటీడీ ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, 6వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలను తయారుచేస్తోంది. తిరుమలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ స్వామి ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు.

సాధారణంగా దర్శనం చేసుకున్న భక్తులకు ఒక చిన్న లడ్డూను ఫ్రీగా ఇస్తున్నారు. రోజుకు సరాసరి 70వేల మంది శ్రీవారిని దర్శించుకుంటారు. ఉచిత లడ్డూలే 70వేలు అందించాలి. వీటితోపాటు భక్తులు తమ బంధువులు, చుట్టుపక్కల ఉన్నవారికి శ్రీవారి ప్రసాదాన్ని అందించేందుకు అదనంగా మరిన్ని లడ్డూలు కొనుగోలు చేస్తుంటారు.

సాధారణ రోజుల్లో ఇబ్బందులు లేకున్నా..వారాంతాలు , ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల సమయంలో డిమాండ్ మాత్రం అధికంగా ఉంటోంది. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని అదనంగా మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు, 3,500 వడలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. వీటన్నింటిని ద్రుష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులతోపాటు మరో 10 మంది శ్రీ వైష్ణువులు కానివారిని కూడా నియమించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories