Gammon Bridge : గామన్ బ్రిడ్జి..ట్రబుల్ జర్నీ..!

Gammon Bridge : గామన్ బ్రిడ్జి..ట్రబుల్ జర్నీ..!
x
Highlights

Gammon Bridge : రోడ్డు మొత్తం తుక్కుతుక్కయిపోయింది. కన్ను పక్కకు తిప్పితే ప్రమాదం నెలకొనే పరిస్థితి నెలకొంది. ఆ రోడ్డులో ప్రయాణం అందరికీ నరకంగా...

Gammon Bridge : రోడ్డు మొత్తం తుక్కుతుక్కయిపోయింది. కన్ను పక్కకు తిప్పితే ప్రమాదం నెలకొనే పరిస్థితి నెలకొంది. ఆ రోడ్డులో ప్రయాణం అందరికీ నరకంగా మారింది. అత్యంత అధ్వానంగా మారినా గామన్‌ బ్రిడ్జిని పట్టించుకునే నాథుడే లేడు. దీంతో వాహనదారులు హడలిపోతున్నారు. గోదావరి వంతెనల మీద పయనం ప్రమాదకరంగా మారింది. గామన్‌ బ్రిడ్జి మీద పయనం అంటే వాహనదారులు హడలిపోతున్నారు. వాహనాలు తుక్కు తుక్కయిపోతున్నాయి. గామన్‌ బ్రిడ్జి రోడ్లను చూస్తేనే భయపడిపోయే పరిస్థితి నెలకొంది.

రోజుకు కొన్ని వందల వాహనాలు పెద్ద లారీల డ్రైవర్లతోపాటు, కార్లు, మోటారు సైకిళ్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. భారీ వాహనాలు కూడా తుక్కుతుక్కయిపోతున్నాయి. కొత్త టైర్లు కూడా ఇక్కడి పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాయని వాహనాదాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిడ్జి పైనా, రోడ్డు మీద అనేక ప్రమాదాలు జరుగుతున్న గామాన్ కంపెనీ కనీస బాధ్యత వహించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెటీరియల్ సరిగా వాడకపోవడం వల్ల పనుల్లో డొల్ల తనం బయపడిందని ఆరోపిస్తున్నారు. టోల్‌గేట్ వసూలు చేసనిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తంగా మరమ్మతుల పేరిట తతంగం నడుపుతున్నారు కానీ పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శ వినిపిస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories