డొక్కా-గల్లా కోల్డ్‌వార్‌లో తెరపైకి వచ్చిన కొత్త ట్విస్టేంటి?

డొక్కా-గల్లా కోల్డ్‌వార్‌లో తెరపైకి వచ్చిన కొత్త ట్విస్టేంటి?
x
Highlights

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందగా ఉంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి. నియోజకవర్గంలో ఇద్దరు బడా...

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం చందగా ఉంది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల పరిస్థితి. నియోజకవర్గంలో ఇద్దరు బడా నాయకుల మధ్య కోల్డ్‌వార్‌కు, కార్యకర్తలే హడలిపోతున్నారు. టీడీపీ హెడ్‌క్వార్టర్‌ కూడా ఇప్పుడక్కడే ఉండటంతో, ఈ తలనొప్పి చంద్రబాబుకు చికాకు తెప్పిస్తోంది. తన ఓటమికి టీడీపీకి చెందిన మరో కీలక నేతే కారణమంటూ, ఓడిపోయిన సదరు ఎమ్మెల్యే అభ్యర్థి, గోడు వెళ్లబోసుకుంటుండటంతో, షాకయ్యారట చంద్రబాబు. ఇంతకీ ఎవరా ఇద్దరు నాయకులు వారిమధ్య గొడవెందుకు రాజుకుంది నిజంగానే సదరు ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి సొంత పార్టీ నేతే కారణమా?

గుంటూరు జిల్లాలో, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరులో మొదటి నుంచి గట్టిపట్టుందని భావిస్తున్న తెలుగుదేశం, ఫలితాలను చూసి ఇంకా జీర్ణించుకోలేకపోతోందట. ముఖ్యంగా ప్రత్తిపాడులో అయితే, ఓటమికి నువ్వంటే నువ్వు కారణమని, పార్టీలోని ఇద్దరు ప్రముఖ నేతల విసుర్లు కసుర్లు హద్దులు దాటుతున్నాయట.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు మాజీమంత్రి డొక్కా మాణిక్యా వరప్రసాద్. ప్రత్తిపాడు నియోజకవర్గంలోకి డొక్కా వచ్చే వరకు టీడీపీ పరిస్థితి కుక్కల చింపిన విస్తరిలా ఉండేదని, ఆ పార్టీ నేతలు ఇప్పటికీ చెప్పుకుంటారు. మాజీమంత్రి రావెల, కందుకూరు వీరయ్య,మాకినేని పెదరత్తయ్య, ఎంపీ గల్లా వర్గాలతో పార్టీ చిందరవందరగా ఉండేదట. అలాంటి ప్రత్తిపాడు నియోజకవర్గంలో వర్గపోరుకు చెక్ పెట్టి, తనకంటూ స్పెషల్ మార్క్ వేసుకున్నారట మాజీమంత్రి డొక్కా. తాను తాడికొండ సీటు ఆశిస్తే ప్రత్తిపాడు టిక్కెటు ఇచ్చారని, అయినా తాను అందర్నీ ఒకే తాటిపైకి తీసుకొచ్చానని ఫీలవుతుంటారు డొక్కా. ఇదే గల్లా వర్గానికి మంటపుట్టిస్తోంది.

గడిచిన ఎన్నికల్లో గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేసిన ప్రచారమే, తనను ఓడించిందని డొక్కా రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి, ఎంపీకి మాత్రం టీడీపీకే వేయండి అంటూ అభ్యర్థించారట అరుణకుమారి. కుట్రపూరితంగానే గల్లా ఇలాంటి ప్రచారం చేశారని మండిపోతున్నారట డొక్కా. అంతేకాదు ఈ విషయాన్ని టీడీపీ ఛీఫ్ చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళారు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం వివరణ కూడా అడగలేదు. దీంతో మరింత అసంతృప్తితో ఉన్నారు డొక్కా.

ఇటీవలే గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న చంద్రబాబు వద్దకు, టీడీపీ క్యాడర్‌ను మండలాల వారీగా తీసుకొచ్చి, వాస్తవాలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు డొక్కా. దీనికి పోటీగా మాజీమంత్రి పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ కూడా తన వర్గాన్ని చంద్రబాబు దగ్గరకు తీసుకొస్తున్నారు. దీంతో ప్రత్తిపాడు టీడీపీలో గల్లా వర్గం, డొక్కా వర్గం, రెండుగా చీలిపోయాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఓడిపోయి పుట్టెడు దుంఖంలో ఉంటే, ఈ వర్గపోరుకు ఎలా చెక్ పెట్టాలని చంద్రబాబు తలపట్టుకుంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories