Further Development in Visakhapatnam: విశాఖలో మరింత అభివృద్ది.. నౌకాశ్రయం విస్తరించేందుకు కేంద్రం ఏర్పాట్లు

Further Development in Visakhapatnam: విశాఖలో మరింత అభివృద్ది.. నౌకాశ్రయం విస్తరించేందుకు కేంద్రం ఏర్పాట్లు
x
visakhapatnam
Highlights

Further Development in Visakhapatnam: ఇప్పటికే అభివృద్ది వైపు పరుగులు తీస్తున్న విశాఖపట్నం మరింత విస్తరించేందుకు పరిస్తితులు అనుకూలిస్తున్నాయి.

Further Development in Visakhapatnam: ఇప్పటికే అభివృద్ది వైపు పరుగులు తీస్తున్న విశాఖపట్నం మరింత విస్తరించేందుకు పరిస్తితులు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం విశాఖను క్యాపిటల్ గా చేయడంతో మరిన్ని పరిశ్రమలతో పాటు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం విశాఖ నౌకాశ్రయాన్ని మరింత విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తుండటం దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడం చేస్తుండటంతో మరో అడుగు ముందుకు పడినట్టు తెలుస్తోంది. దీని నిర్మాణం వల్ల మరిన్ని అనుబంధ పరిశ్రమలు ఏర్పాటయితే మరింతమందికి ఉపాధి లభించే అవకాశం కనిపిస్తోంది.

విశాఖపట్నానికి మహర్దశ పట్టే అవకాశం కనబడుతోంది. నౌకాశ్రయాల ఆదారంగా పరిశ్రమలు అభివీద్ది చేయడానికి కేంద్రం ఒక ప్రణాళిక తయారు చేసింది.అందుకోసం ఓడరేవులకు అనుబందంగా లక్షా పదివేల హెక్టార్ ల భూమిని కేంద్రం కేటాయించింది. కేంద్రం ఎంపిక చేసిన నౌకాశ్రయాలలో విశాఖపట్నం కూడా ఉంది. కోల్ కొత, పరదీప్,కాండ్లా, ముంబై, మార్మగోవా,న్యూ మంగుళూరు,చెన్నై మొదలైన నగరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో విశాఖ కూడా ఉండడంతో ఓడరేవులకు అనుబందంగా ఉండే పరిశ్రమలు అక్కడ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కార్యనిర్వాహక రాజధాని గా విశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కొత్త పరిశ్రమలు కూడా వస్తే అది విశాఖ అతి త్వరంలోనే మరింత మహానగరంగా మారే అవకాశం ఉంటుంది.తద్వారా ఎపికి కూడా ఆదాయం పెరిగే వీలు ఉంటుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories