ఇవాళ రాత్రికి మేకపాటి పార్ధివ దేహం నెల్లూరుకు తరలింపు

Funeral Minister Mekapati Goutham Reddy Latest Update
x

ఇవాళ రాత్రికి మేకపాటి పార్ధివ దేహం నెల్లూరుకు తరలింపు

Highlights

Mekapati Goutham Reddy: ఇవాళ రాత్రికి మేకపాటి పార్ధివ దేహం నెల్లూరుకు తరలింపు, ఎల్లుండి మేకపాటి భౌతిక కాయానికి అంత్యక్రియలు.

Mekapati Goutham Reddy: ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పార్దివ దేహం ఇవాళ రాత్రికి నెల్లూరుకు తరలించనున్నారు. ఎల్లుండి మేకపాటి స్వగ్రామం బ్రహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. మేకపాటి మరణం తీవ్రదిగ్ర్బాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనన్నారు. తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నాయకుడు గౌతం రెడ్డి అన్నారు. గౌతం రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.

మేకపాటి గౌతం రెడ్డి మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిల అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. గౌతం రెడ్డి ఎంత సౌమ్యులు, సంస్కార వంతులని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కల్గిన నాయకుడన్నారు. గౌతమ్ రెడ్డి తాతగారి నుంచి వారి కుటుంబంతో ఎంతో అభిమానం చూపేవారన్నారు. గౌతం రెడ్డి మరణం పట్ల మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, తానేటి వనిత, అనీల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్, తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, సీపీఐ నేత నారాయణ సహా పలువులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories