Free Ration Distribution in AP: రేపట్నుంచి ఉచిత రేషన్ సరుకులు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు

Free Ration Distribution in AP: రేపట్నుంచి ఉచిత రేషన్ సరుకులు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు
x
Free Ration Distribution in AP
Highlights

Free Ration Distribution in AP: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత రేషన్ సరుకులు రేపట్నుంచి ఏపీలో పంపిణీ

Free Ration Distribution in AP: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెలాఖరు నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత రేషన్ సరుకులు రేపట్నుంచి ఏపీలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు లాక్ డౌన్ తరువాత అన్ లాక్ లు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు పేదలకు రేషన్తో పాటు కందిపప్పు లేదా శెనగలు ఉచితంగా అందించేందుకు నిర్ణయించాయి. ఈ సమయంలో కూలీ పనులకు అవకాశాలు తక్కువుగా ఉండటం వల్ల జీవనోపాధి కోల్పోతారని భావించిన ప్రభుత్వాలు వీటిని అందించేందుకు ఏర్పాటు చేశాయి. వీటిలో కేంద్ర ప్రభుత్వం ఒకసారి, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి అందించేలా చర్యలు తీసుకున్నాయి.

పేదలకు ఎనిమిదో విడత ఉచితంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సరుకులను సిద్ధం చేసింది. సోమవారం నుంచి లబ్ధిదారులు బియ్యంతో పాటు శనగలను ఉచితంగా తీసుకోచ్చు. మండల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి అవసరమైన సరుకులను ఇప్పటికే రేషన్‌ షాపులకు తరలించారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు కార్డుల్లో పేర్లు నమోదైన ఒక్కో వ్యక్తికి ఐదు కిలోలు, కుటుంబానికి కిలో కందిపప్పు లేదా శనగలు నెలకు రెండుసార్లు పంపిణీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. కరోనా తీవ్రమవుతున్నందున ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

భౌతిక దూరం తప్పనిసరి

► రేషన్‌ షాపుల వద్ద గుంపులుగా ఉండకూడదు. విడతల వారీగా రావాలి.

► బయోమెట్రిక్‌ వేసే ముందు, ఆ తర్వాత చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి.

► శానిటైజర్, నీళ్లు, సబ్బును రేషన్‌ డీలర్లు అందుబాటులో ఉంచాలి.

► సోమవారం నుంచి 28వ తేదీ వరకు రేషన్‌ షాపులను తెరవాలి.

► ఈ దఫా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధిపొందనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories