Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Free Gas Distribution Scheme from Diwali Says Nadendla Manohar
x

Free Gas Cylinder: ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన

Highlights

Nadendla Manohar: ఏపీ ప్రజలకు దీపావళి కానుకగా కూటమి ప్రభుత్వం.. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనుంది.

Nadendla Manohar: ఏపీ ప్రజలకు దీపావళి కానుకగా కూటమి ప్రభుత్వం.. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్లను బుక్‌ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఆధార్‌, తెల్ల రేషన్‌కార్డు అర్హత కలిగిన అందరూ ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ను పొందొచ్చన్నారు. ఈ నెల 31 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడైనా మొదటి సిలిండర్‌ తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

29వ తేదీన ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయన్నారు. ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇప్పిస్తామని.. బుకింగ్ కన్ఫం అవ్వగానే ఉచిత గ్యాస్ సిలెండర్ కోసం ఒకటి బుక్ అయ్యిందని ఎస్‌ఎమ్‌ఎస్ వెళుతందన్నారు. మూడు ఆయిల్ కంపెనీలతో జరిగిన చర్చను బట్టి 24 నుంచి 48 గంటల్లోపు డెలివరీలు పూర్తవుతాయన్నారు. గ్యాస్ సిలెండర్ అందించిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ అవుతుందన్నారు. రూ.894.92 కోట్లు ఆయిల్ కంపెనీలకు 29న అందిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories