Grandhi Srinivas: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా

Grandhi Srinivas
x

Grandhi Srinivas

Highlights

Grandhi Srinivas: వైఎస్ఆర్సీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గురువారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు

Grandhi Srinivas: వైఎస్ఆర్సీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (grandhi srinivas) గురువారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ( (ys jagan) కు పంపారు. ఆయన టీడీపీ (టీడీపీ )లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.ఉమ్మడి ఆంధ్రపరదేశ్ రాష్ట్రంలో 2004లో ఆయన తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో ఆయన ప్రజారాజ్యంలో చేరారు. 2013 లో

వైఎస్ఆర్‌సీపీ ((ysrcp)లో చేరారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో భీమవరం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ సీపీకి చెందిన నాయకులు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఉదయబాను వైఎస్ఆర్సీపీని వీడి జనసేనలో చేరారు. తాజాగా ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories