ఏపీ డీజీపీకి మాజీ సీఎం చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీకి మాజీ సీఎం చంద్రబాబు లేఖ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, పౌరుల ప్రాథమిక హక్కుల..

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో లేఖ రాశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలకు ఏపీ వేదికైందని లేఖలో పేర్కొన్నారు. పోలీసులపై వ్యక్తిగత కేసుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందంటూ చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటానా స్వేచ్చపై దాడులు ప్రతిరోజు షరామామూలే అయ్యాయని ఆయన ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యల్ని ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని.. ఇన్ని దాడులు జరుగుతున్న పోలీసులు ఉదాసీనంగా ఉన్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యల గురించి డీజీపీ దృష్టికి తేవడం ప్రతిపక్షనేతగా తన కర్తవ్యమని చంద్రబబు లేఖలో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, వివిధ అంశాల విషయంలో ఇప్పటికే చాలా సార్లు లేఖ రాశారు చంద్రబాబు. అయితే వాటికి సాక్షాలు కావాలని.. లేదంటే కేసులను తీసుకోమని డీజీపీ సమాధానం ఇచ్చారు. దీనిపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories