Nellore: వింజమూరులోని ప్రైవేట్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినిలకు అస్వస్థత

Food Poisoning In A Private School In Vinjamur  Nellore District
x

Nellore: వింజమూరులోని ప్రైవేట్ స్కూల్‌లో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థినిలకు అస్వస్థత 

Highlights

Nellore: ఫుడ్ పాయిజన్‌పై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసిన తల్లిదండ్రులు

Nellore: నెల్లూరు జిల్లా వింజమూరులోని ప్రైవేట్ స్కూ‌ల్లో విద్యార్ధినిలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న 20 మంది బాలికలు వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాగా.. బాలికలు అనారోగ్యానికి గురైనా... వారిని ఆస్పత్రికి తరలించడంలో.. స్కూల్ యాజమాన్యం... నిర్లక్ష్యం వహించినట్టు తెలుస్తుంది. దీంతో.. బాలికలు స్వయంగా వెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా.. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఫుడ్ పాయిజన్ ఘటనపై.. బాలికలను ఆస్పత్రికి తరలించకపోవడంపై తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యిందని తల్లిదడ్రులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories