Narsipatnam: నర్సీపట్నం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి అయ్యన్న ఫైర్

Narsipatnam: నర్సీపట్నం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి అయ్యన్న ఫైర్
x
Fomer minister Ayyanna
Highlights

మాజీ మంత్రి అయ్యన్న స్థానిక శాసనసభ్యులు పేట్ల ఉమాశంకర్ గణేష్ పై ఫైర్ అయ్యారు.

మాజీ మంత్రి అయ్యన్న స్థానిక శాసనసభ్యులు పేట్ల ఉమాశంకర్ గణేష్ పై ఫైర్ అయ్యారు. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో డాక్టర్ సుధాకర్ విషయం సంచలనంగా మారింది. అయితే స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ నాపై ఆరోపణలు చేయడం సరికాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఎమ్మెల్యే తనపై చేసిన ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, రుజువు చేయలేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పని చేశాను.

నాకు రాజకీయ కాంక్ష లేదని ఎమ్మెల్యే ఒక బుర్ర లేని వాడు అని అన్నారు .సన్యాసి పాత్రుడు అన్న ఒక సన్నాసి అని, నేను ఇప్పుడు ఇంటికి వస్తున్నాను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను ఆ వీడియోలు ఫోటోలు ఎమ్మెల్యే గణేష్కు అమ్ముకున్నాడని ఆరోపించారు. ఆ వీడియోలు, ఫోటోలు గణేష్ కొనుక్కొని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మీడియా సమావేశంలో ఓ మంత్రి మాట్లాడుతూ... నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారని ఆయన అనడం సరికాదని అన్నారు.

మీకు ఆరోగ్య శాఖ అంటే ఏమిటో తెలియకుండానే ఆరోగ్య శాఖ మంత్రి అయి పోయావని, నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో గతంలో ఎన్ని డెలివరీలు జరిగాయో మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ లో ఎన్ని డెలివరీలు జరుగుతున్నాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories