త్వరలో విశాఖ బీచ్ లో అద్భుత విహారం

త్వరలో విశాఖ బీచ్ లో అద్భుత విహారం
x
Highlights

గాల్లో తేలుతూ, కింద కడలిని చూస్తు విందు చేసుకోవచ్చు. అలల కదలికలను చూస్తు సాగరంపై నడుస్తు వెళ్లోచ్చు. ప్రభుత్వ నుండి అనుమతులు రాగానే త్వరలో ఈ అద్బుత...

గాల్లో తేలుతూ, కింద కడలిని చూస్తు విందు చేసుకోవచ్చు. అలల కదలికలను చూస్తు సాగరంపై నడుస్తు వెళ్లోచ్చు. ప్రభుత్వ నుండి అనుమతులు రాగానే త్వరలో ఈ అద్బుత విహారాన్ని రుషికొండలో చూడోచ్చు. పర్యాటకులను అబ్బురపరిచే ప్లై డైనింగ్, ప్లోటింగ్ జెట్టీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయనడంతో సందేహం లేదు. ఈ తరహ పర్యాటకానికి ఎపి టూరిజం ప్రణాళిక సిద్దం చేసింది.

సముద్ర తీరంలో వందల అడుగుల ఎత్తున ఆకాశంలో తెలిపోతూ కుటుంబీకులతో, స్నేహితులతో కలిసి విందు ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. చుట్టు ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించోచ్చు. సుందర నగరాన్ని వీక్షించవచ్చు. ఇప్పటికే ఈ ప్లై డైనింగ్ పర్యాటక దేశాల్లోని కొన్ని ప్రముఖ నగరాల్లో ఉంది. సముద్రంపై గాల్లో విహరించే అవకాశమున్న విశాఖలో వీటిని ఎర్పాటు చేసేందుకు ప్రైవేటు సంస్థలు సిద్దంగా ఉన్నాయి.

క్రేన్ సాయంతో భూమికి 50 మీటర్లు ఎత్తున ప్లై డైనింగ్ ఎర్పాటు చేస్తారు. 20 మందికి పైగా ఒకే చోట కూర్చోవచ్చు. మరో నలుగురు అతిధ్య సేవలు అందిస్తారు. సేప్టీ బెల్టులు సాయంతో సౌకర్యవంతంగా అత్యంత సురక్షితంగా ఉండోచ్చు. క్రైన్ సాయంతో చుట్టు తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించోచ్చు. నిర్వహణ బాద్యతలు ప్లై డైనింగ్ వారు పర్యవేక్షిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రుషికొండ బీచ్ లో దీనిని ఎర్పాటు చేయ్యనున్నారు. దీనిని ఎర్పాటు చేస్తే విదేశీ పర్యాటకులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు బావిస్తున్నారు.

మరోవైపు బ్లూప్లాగ్ రేసులో ఉన్న రుషికొండ తీరంలో ప్లోటింగ్ జెట్టి నిర్మాణానికి ఏపీటీడీసీ ప్రతిపాదన పంపింది. ఇక్కడ బోటింగ్ నిర్వహణకు జెట్టీ అవసరం ఉంది. ఇక్కడ బోటింగ్ కు విపరీతమైన క్రైజ్ ఉంది. బోటింగ్ ప్రమాద నియంత్రణ కేంద్రం కుడా రుషికొండలో ఎర్పాటు చేసారు. బోటింగ్ చేసిన ప్రతిసారి కుడా బోట్లును ఓడ్డుకు తీసుకువస్తారు. ఈ క్రమంలో బోట్లు మరమ్మతులకు గురవడం, ఆటుపోట్లు సమయంలో నీరు లోపలికి వెళ్ళడం వల్ల బోట్లు ఆగిపోవడం జరగుతుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా జెట్టీ నిర్మించనున్నారు. దీన్ని పర్యాటకుల కోసం వినియెగించనున్నారు. తీరం నుంచి అలలు ఎర్పడే ప్రాంతం వరకు నిర్మిస్తారు. ఒక్కో విడత 20 మంది చోప్పున 30 నిమిషాలు పాటు ఉంచుతారు. జెట్టిని 300 మీటర్లు పోడవున, 20 మీటర్లు వెడల్పున నిర్మిస్తారు. పడిపోకుండా రెండు వైపులు వలతో పాటు స్తంభాలు ఎర్పాటు చేస్తారు. ఎదైమైనా అంతర్జాతీయ హంగులతో రుషికొండ తీరం పర్యాటాకానికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories