Vijayawada: హోం మంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు

Floodwater Surrounds Home Minister Anitha Residence In Vijayawada
x

Vijayawada: హోం మంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద నీరు

Highlights

Vijayawada: విజయవాడను చుట్టుముట్టిన వరదలో బాధితురాలిగా ఏపీ హోంమంత్రి కూడా ఉన్నారు. రామవరప్పాడు బ్రిడ్జి కింద జలదిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది.

Vijayawada: విజయవాడను చుట్టుముట్టిన వరదలో బాధితురాలిగా ఏపీ హోంమంత్రి కూడా ఉన్నారు. రామవరప్పాడు బ్రిడ్జి కింద జలదిగ్బంధంలో హోంమంత్రి నివసించే కాలనీ ఉంది. దీంతో వంగలపూడి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది. అప్రమత్తమైన విపత్తు నిర్వహణ శాఖ టీమ్ హోంమంత్రి అనిత కుటుంబసభ్యులను ఓ ట్రాక్టర్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆమె ఇంటిని వరద నీరు చుట్టుముట్టడంతో ఆమె తన పిల్లల్ని ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ బృందం మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో ముందు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అనిత వారిని ఆదేశించారు.

కాలనీలో ఇతర కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆమె ఏర్పాట్లు చేశారు. తన ఇంటి వద్దకు వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ ప్రాంతానికి వెళ్లి వరద బాధితులకు సహాయసహకారాలు అందించాలని హోమంత్రి సూచించారు. మరోవైపు విజయవాడలో వరద బాధితులకు ఆహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దుర్గగుడి ద్వారా ఆహారం తయారు చేయించాలని సీఎం చంద్రబాబు దుర్గగుడి అధికారులతో మాట్లాడారు. ఇవాళ 50వేల మందికి పులిహోర సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు ప్రైవేట్ హాటల్స్ యాజమానులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ఉదయంలోపు లక్ష మందికి ఆహారం సిద్ధం చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories