నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి : సీఎం జగన్

నష్టపోయిన సీజన్‌లోనే పరిహారం చెల్లించడం చరిత్రలో ఇదే తొలిసారి : సీఎం జగన్
x
Highlights

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదన్న సీఎం జగన్‌...తమది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటష్టపోయిన రైతులకు ఆ నష‌్టం...

గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదన్న సీఎం జగన్‌...తమది రైతుల పక్షపాత ప్రభుత్వమన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో పంటష్టపోయిన రైతులకు ఆ నష‌్టం వర్షాల వల్ల కావచ్చు.. తుపాన్‌ల వల్ల కావచ్చు.. వరదల వల్ల కావచ్చు.. కారణం ఏదైనా అదే సీజన్‌లో రైతులకు పంటనష్ట పరిహారం చెల్లించడమనేది చరిత్రలో ఇదే తొలిసారి... ఇదే ప్రథమమన్నారు సీఎం జగన్. నివర్ తుపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ.500 ఆర్ధిక సాయం ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఇంటికి రూ.2వేలు ఆర్ధిక సాయం అందుతుంది.

డిసెంబర్ 15లోగా పంట నష్టం అంచనాలను పూర్తి చేయాలని ఆదేశించాం. డిసెంబర్ 31లోగా పంట నష్ట పరిహారం చెల్లించాలని నిర్ణయించాం. నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు కూడా అందిస్తాం. ఇళ్లు, పశువులు, ఇతర నష్టాలను కూడా డిసెంబర్ 15లోగా అంచనా వేస్తాం. డిసెంబర్ 31లోగా నష్టపరిహారం అందిస్తాం. తుపాను, వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం అని సీఎం జగన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories