Visakhapatnam: మహిళా వాలంటీర్‌ గౌరీపై ఉద్యోగుల లైంగిక వేధింపులు

Female Volunteer Gauri Was Sexually Harassed By Employees In Visakhapatnam
x

Visakhapatnam: మహిళా వాలంటీర్‌ గౌరీపై ఉద్యోగుల లైంగిక వేధింపులు

Highlights

Visakhapatnam: స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగడంలేదని ఆవేదన

Visakhapatnam: విశాఖ జిల్లా పెందుర్తి వార్డు సచివాలయంలో ఓ మహిళా వాలంటీర్‌పై ‎ఇద్దరు ఉద్యోగులు వేధింపులకు పాల్పడుతున్నారు. గౌతమ్‌నగర్‌లో ఉన్న సచివాలయం అడ్మిన్ రాము, ఎమినిటీ సెక్రటరీ కిరణ్‌లపై ఓ మహిళా వాలంటీర్ ఆరోపణలు చేసింది. ఏడాదిగా తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించింది. వాట్సప్‌లో చాటింగ్ చేయాలని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఉద్యోగులపై ఆరోపణలు చేసింది. తన భర్త సహాయంతో ఎమ్మెల్యే అదీప్‌రాజుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయినా కూడా వేధింపులు ఆగడంలేదని మహిళా వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేసింది. అధికార పార్టీ నేతల అండదండలతోనే సచివాలయ ఉద్యోగులు రెచ్చిపోతున్నారని బాధితురాలి భర్త ఆరోపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories