Tirumala: తిరుమలలో గోల్డ్‌ ఫ్యామిలీ హల్‌చల్‌.. ఒక నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా..

Golden Guys
x

Tirumala: తిరుమలలో గోల్డ్‌ ఫ్యామిలీ హల్‌చల్‌.. ఒక నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా..

Highlights

ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది ఓ బంగారు కుటుంబం.

Tirumala: తిరుమలలో ఓ గోల్డ్‌ ఫ్యామిలీ హల్‌చల్‌ చేసింది. శ్రీవారి ఆలయ సన్నిధిలో గోల్డ్‌ ఫ్యామిలీ ఏంటని ఆశ్చర్య పోతున్నారా..? మీరు వింటున్నది.. చూస్తున్నది నిజమే..! ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఓ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది ఓ బంగారు కుటుంబం. చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లేట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్ద పెద్ద గోల్డ్‌ చైన్లు.. మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది. ముంబయికి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు రూ.15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు.

దర్శనం అనంతరం బయటకు వచ్చిన ఆ గోల్డ్‌ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు.. నోటిన వేలు వేసుకున్నారు. ఒక నగల దుకాణమే తరలివచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు. బంగారు నగల అలంకరణతో దగదగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. వాళ్ల ఒంటిపై మాత్రమే కాదు.. వారు వచ్చిన కారు కూడా గోల్డ్‌ కోటే. దీంతో వాళ్లు కారెక్కి వెళ్లేంతవరకు కూడా కనురెప్పలు మూయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.



Show Full Article
Print Article
Next Story
More Stories