AP Rains: దిశ మార్చుకున్న తుపాన్..ఏపీకి తప్పిన ముప్పు ...ఇవాళ, రేపు భారీ వర్షాలు

AP Rains: దిశ మార్చుకున్న తుపాన్..ఏపీకి తప్పిన ముప్పు ...ఇవాళ, రేపు భారీ వర్షాలు
x
Highlights

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపాన్ రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తుపాన్ దిశ...

AP Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రతికూల పరిస్థితులతో తుపాన్ రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తుపాన్ దిశ మార్చుకున్నట్లు వెల్లడించింది. ఏపీకి తుపాన్ ముప్పు తిప్పినప్పటికీ నేడు, రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ భయంభ్రాంతులకు గురి చేసింది. ఇది తీవ్ర వాయుగుండం ఏర్పడి భారీ అల్లకల్లోలం స్రుష్టిస్తుందని మొదట అంచనా వేసింది ఐఎండీ. అయితే ఇప్పుడు ఈ తుపాన్ దిశ మార్చుకుంది. తమిళనాడుకు వస్తుందన్న ఈ తుపాన్ సడెగా దిశమార్చుకోవడంతో గంటకు 3 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది.

అయితే ఇది ఇప్పటికీ తీవ్ర వాయుగుండంగానే ఉందని నేడు శుక్రవారం తుపాన్ గా మారుతుందని ఐఎండీ తెలిపింది. ఇది ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది. 30వ తేదీ శనివారం వాయవ్య దిశగా కదులుతూ..తమిళనాడు-పుదుచ్చేరి తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈ తుపాన్ వల్ల గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో డిసెంబర్ 2 వరకు ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శనివారం తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

అలాగే నవంబర్ 29న భారీ నుంచి అతిభారీ, కుండపోత వర్షాలు ఏపీలోని రాయలసీమ, యానాంలో కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 30న కోస్తాంధ్ర, రాయలసీమలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇక నేడు తెలంగాణలో మేఘాలు కమ్ముకుంటాయి. మధ్యాహ్నం తర్వాత తూర్పు, దక్షిణ రాయలసీమలో వర్షాలు మొదలవుతాయి. రోజంతా వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. తిరుపతి, నెల్లూరు, కడప, ఒంగోలు, ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. అటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంపై ఇస్రో ప్రభుత్వానికి నిరంతరం సంకేతాలిస్తోంది. ఈవోఎస్ 06, ఇన్సాట్ 3డీ ఆర్ ఉపగ్రహాలు ఫంగల్ తుపాన్ సమచారాన్ని అందిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories