Export of Chillies to Other Countries: ఇతర దేశాలకు మిర్చి ఎగుమతి.. తక్కువ ఖర్చుతో హై స్పీడ్ రైలు వినియోగం

Export of Chillies to Other Countries: ఇతర దేశాలకు మిర్చి ఎగుమతి.. తక్కువ ఖర్చుతో హై స్పీడ్ రైలు వినియోగం
x
Export of Chillies to Other Countries
Highlights

Export of Chillies to Other Countries: తక్కవ ఖర్చుతో వీలైనంత తొందర్లో సరుకు గమ్యస్థానికి చేరిస్తే దానికే ప్రాధాన్యత ఇస్తారు.

Export of Chillies to Other Countries: తక్కవ ఖర్చుతో వీలైనంత తొందర్లో సరుకు గమ్యస్థానికి చేరిస్తే దానికే ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల సరుకు నాణ్యతలో సమస్య ఉండదు. అందుకే ఎక్కువ శాతం మంది వ్యాపారులు ఈ దారిని ఎంచుకున్నారు. కోవిడ్‌ –19 నేపథ్యంలో గుంటూరు వ్యాపారులు ఎగుమతులకు కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో మాదిరిగా నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో కాకుండా హైస్పీడ్‌ పార్శిల్‌ రైళ్లలో విదేశాలకు వాణిజ్య పంటలు ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నారు.

ప్రస్తుతం ఈ విధానంలో బంగ్లాదేశ్‌కు మిర్చి ఎగుమతి చేస్తుండగా త్వరలో చైనా, వియత్నాం దేశాలకు కూడా ఎగుమతులకు హైస్పీడ్‌ రైళ్లు వినియోగించాలని యోచిస్తున్నారు. తక్కువ కాలంలో సరుకు ఎగుమతి అవుతుండటంతోపాటు సరిహద్దుల్లో ఎటువంటి సమస్యలు లేకపోవడంతో వ్యాపారులు ఈ విధానం పట్ల మొగ్గు చూపుతున్నారు. గుంటూరు రైల్వే డివిజన్‌ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. హైస్పీడ్‌ రైళ్లలో మిర్చి ఎగుమతికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందింది.

విదేశాలకు ఏటా రూ.3 వేల కోట్ల మిర్చి

► బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం మిర్చికి మంచి డిమాండ్‌ ఉంది. గుంటూరు కేంద్రంగా కొన్ని సంస్థలు ఏటా రూ.3 వేల కోట్ల విలువైన మిర్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.

► చైనాకు రూ.1500 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.1000 కోట్లు, వియత్నాంకు రూ.500 కోట్ల విలువైన పంట ఎగుమతి చేస్తున్నాయి.

► బంగ్లాదేశ్‌లో క్వింటా మిర్చికి రూ.13,500 నుంచి రూ.14,500 (తేజరకం) ధర లభిస్తోంది. లాక్‌డౌన్‌ ముగిశాక వ్యాపారులు నౌకలు, లారీలు, గూడ్స్‌ల్లో ఎగుమతి చేస్తున్నారు.

► అయితే ఎగుమతికి ఏడెనిమిది రోజుల సమయం పట్టడంతోపాటు దేశ సరిహద్దుల వద్ద లారీల అనుమతికి ఆలస్యమవుతోంది. ఈ లోగా ధరల్లో మార్పులు వస్తుండటంతో వ్యాపారులు, ఎగుమతిదారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.

► గుంటూరు రైల్వే డివిజన్‌ మిర్చి, అల్లం, ఉల్లి, పసుపు పంటల ఎగుమతికి హైస్పీడ్‌ పార్శిల్‌ రైళ్లను ప్రవేశపెడతామని ప్రకటించింది.

లారీల కంటే తక్కువ ధర..

► లారీలకు చెల్లించే సరుకు రవాణా చార్జీల కంటే రైళ్లలో ధరలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు హైస్పీడ్‌ రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

► రోడ్డు మార్గం ద్వారా బంగ్లాదేశ్‌కు ఎండు మిర్చి రవాణాకు టన్నుకు రూ.7 వేలు. అదే పార్శిల్‌ రైళ్ల ద్వారా అయితే రూ.4,608 మాత్రమే.

► ఈ నెల 9 న గుంటూరు నుంచి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు 16 పార్శిల్‌ వ్యాన్‌లతో కూడిన పార్శిల్‌ ఎక్స్‌ప్రెస్‌లో 384 టన్నుల ఎండు మిర్చి ఎగుమతి చేసిన వ్యాపారులు చార్జీలకింద రైల్వేకి రూ.17.60 లక్షలు చెల్లించారు.

► ఇతర రాష్ట్రాలకు బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతికి ఎఫ్‌సీఐ అధికారులు తమను కలిసినట్టు గుంటూరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌

మోహన్‌రాజా మీడియాకు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories