టీడీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన గల్లా అరుణ

టీడీపీని వీడటంపై క్లారిటీ ఇచ్చిన గల్లా అరుణ
x
Highlights

టీడీపీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజినామా లేఖను పంపించారు....

టీడీపీ పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశారు ఆ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబుకు రాజినామా లేఖను పంపించారు. దాంతో గల్లా కుటుంబం టీడీపీని వీడుతుందన్న ప్రచారం ఊపందుకుంది. అయితే తాను టీడీపీలోని పదవి నుంచి మాత్రమే తప్పుకున్నానని.. పార్టీ సభ్యత్వానికి కాదని అన్నారు. తనతో పాటు తన కుటుంబం కూడా టీడీపీలోనే కొనసాగుతుందని అరుణకుమారి స్పష్టం చేశారు. మంచి వారిని పెట్టుకోవడానికి చంద్రబాబునాయుడుకు వెసులుబాటు ఇచ్చి.. సహకరించాలనే ఉద్ద్యేశంతోనే పొలిట్ బ్యూరోకు రాజీనామా చేశానని ఆమె తెలిపారు.

కాగా సుధీర్ఘకాలం అరుణ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత అరుణకుమారి కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో చంద్రగిరి నియోజవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీ తరపున గుంటూరు నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2014 - 2019 వరుసగా రెండు సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories