Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

Everyone Is Excited About Pawan Kalyan Meeting With Chandrababu
x

Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ

Highlights

Pawan Kalyan: అరెస్ట్‌పై జూ.ఎన్టీఆర్ స్పందించలేదని పార్టీ వర్గాల్లో చర్చ

Pawan Kalyan: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ ఇవాళ ములాఖాత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పవన్‌కల్యాణ్ పరామర్శించనున్నారు. ములాఖత్ అయ్యేందుకు ఇప్పటికే జైలు అధికారుల నుంచి పర్మిషన్ లభించింది. చంద్రబాబు అరెస్ట్ అయిన క్షణం నుంచి ఆ పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తున్నారు పవన్‌కల్యాణ్.

చంద్రబాబు అరెస్టు చేసిన రోజు విజయవాడకు రావడానికి పవన్ చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలా అని ప్రశ్నించారు. వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు.

మరో వైపు చంద్రబాబు అరెస్టును జాతీయస్థాయి రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు ఖండిస్తున్నారు. సినీనటుడు రజనీకాంత్ నారా లోకేశ్‌కు ఫోన్ చేసి సంఘీభావం తెలియజేశారు. కష్టకాలంలో తమకు అండగా ఉన్న వారందరికీ లోకేశ్ థ్యాంక్స్ చెప్పారు. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ నుంచి ఆశించినంత స్పందన కనిపించడంలేదని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరో వైపు తన మామ అరెస్టుపై ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనే చర్చ జోరుగా జరుగుతోంది. ఐదు రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న చంద్రబాబును ఆయన కుటుంబసభ్యులు లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. ఇవాళ పవన్‌కల్యాణ్ రాక నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జైలు పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories