పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం.. అన్నదాతలపై దాడి చేస్తున్న ఏనుగుల గుంపు..!

elephants attacking farmers
x

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం

Highlights

Farmers: గతంలో ఏనుగులను అటవీప్రాంతానికి తరలించిన అధికారులు... అయినా వెనక్కి వచ్చిన గజరాజుల గుంపు

Elephants In Village: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు సంచరిస్తూ జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రైతులు పండించిన పంటలను నాశనం చేయడంతోపాటు రైతులపై దాడి చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గడిచిన ఐదు సంవత్సరాల క్రితం ఒడిషా అటవీ ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా జిల్లాలోకి ప్రెవేశించిన ఏనుగుల గుంపు జిల్లాను విడిచి పెట్టి వెళ్లడం లేదు. ఏనుగుల గుంపు జిల్లాలో ప్రెవేశించిన మొదట్లో జిల్లా అధికారులు వాటిని ఒడిషా అటవీ ప్రాంతానికి తరలించినప్పటికీ అవి తిరిగి వెనక్కి వచ్చాయి. దీంతో జిల్లా అధికారులు మళ్లీ తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టడం లేదు. దీంతో ఏనుగులు గుంపులు జిల్లాలోనే తిష్టవేశాయి. ఏనుగులు గుంపు జిల్లాలోని వివిధ మండలాల్లో తిరుగుతూ ఇక్కడే తమ ఆవాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏనుగులు తమ సంతతిని పెంచుకుంటుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

జిల్లాలోని నాగావళి నదీ తీర ప్రాంతాల్లో ఏనుగులు ఆవాసాలను ఎర్పాటు చేసుకున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో రైతులు వేసిన ఏనుగులు గుంపులు పంటలను తినేస్తూ నాశనం చేస్తున్నాయి. దీంతోపాటు సమీపంలోని వాహనాలను, పంపుసెట్లను సైతం నాశనం చేస్తున్నాయి. పొలంలో పనిచేస్తున్న రైతులపై దాడి చేసి మట్టుబెడుతున్నాయి. దీంతో పొలాలకు వేళ్లేందుకు రైతులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగుల దాడిలో తమ పంటలు నాశనం చేయడంతో తాము అపార నష్టానికి గురవుతున్నామని, అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఏనుగుల దాడిలో రైతులు పంటలు నాశనం అవుతున్నా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు రైతులు ఇప్పటికే జిల్లాలో ఏనుగుల దాడిలో పది మంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ జిల్లా అధికారులకు కనిపించకపోవడం దురదృష్టకరమన్నారు. జిల్లా వాసులకు ఏనుగుల బెడద నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటున్న రైతుల.

Show Full Article
Print Article
Next Story
More Stories