AP: అధికారం నిలుపుకోవడానికి వైసీపీ.. రూలింగ్‌లో రావాలని టీడీపీ ప్లాన్స్

Election Atmosphere in Andhra Pradesh
x

AP: అధికారం నిలుపుకోవడానికి వైసీపీ.. రూలింగ్‌లో రావాలని టీడీపీ ప్లాన్స్

Highlights

Andhra Pradesh: అన్ని రాజకీయ పార్టీలకు పట్టుకున్న ఎన్నికల ఫీవర్

Andhra Pradesh: ఏపీలో ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే ఎన్నికలు తరుముకు వస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఫీవర్ పట్టుకుంది. ఈ 2024ను కీలకమైన ఎన్నికల ఏడాదిగా టార్గెట్‌ పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్ వర్క్ చేశాయి. అయితే ఈసారి ఎన్నికలు రెండు నెలల ముందే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది.

ఇక 2024 ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ పోటాపోటీగా తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి. మళ్లీ అధికారం చేపట్టేందుకు అధికార వైసీపీ ఇప్పటికే యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ సైతం అధికారం పార్టీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాలను రచిస్తోంది. మరోసారి అధికారంలోకి వస్తే తమకు తిరుగులేదనే పంతాలో వైసీపీ బాస్ జగన్ వెళ్తుండగా.. ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమే అనే భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉంది. ఇక రాబోయే ఎన్నికలు ఈ మూడు పార్టీలకు కీలకం కానున్నాయి.

అయితే ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ గతంలో కంటే ముందుగానే రిలీజ్ అవుతుందనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలను షురూ చేశాయి. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ ముందుకెళ్తోంది. ఇప్పటికే జనసేనతో జట్టుకటిన సైకిల్ పార్టీ ఈసారి ఫ్యాన్‌ పక్కకు పెట్టాలని ప్రజలను కోరుతున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో వైసీపీ క్యాలిక్యులేషన్స్ ఏంటి.. టీడీపీ, జనసేనల ఉమ్మడి వ్యహాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories